హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి తరలిస్తున్న ఐదుగురు యువకులు అరెస్ట్

JN: జిల్లాలో గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం బతుకమ్మకుంట క్రాస్‌రోడ్డు రోడ్డులో వాహన తనిఖీలు చేస్తుండగా రెండు బైకులపై వెళ్తున్న ఐదుగురు పారిపోయేందుకు యత్నించగా పట్టుకున్నారు. వారి నుంచి 245గ్రాముల గంజాయి, రెండు పల్సర్‌ బైకులు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు CI సత్యనారాయణ రెడ్డి తెలిపారు.