KMM: నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధతో పిల్లలకు విషమిచ్చిన ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన 12 ఏళ్ల నిఖిల్ 18 రోజుల చికిత్స అనంతరం ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో తండ్రి శ్రీనివాస్, కుమార్తె లాస్య గత నెల 16నే మృతి చెందారు. నిఖిల్ అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించారు. ఈ ఘటనతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయారు.
తెలంగాణ
చికిత్స పొందుతూ బాలుడు మృతి


