VSP: విశాఖపట్నం సీతమ్మధారలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందిందని కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చేపట్టారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. ఈ ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
ప్రైవేట్ ఆస్పత్రిలో శిశువు మృతి


