NLG: నిడమనూరు మండలం రాజన్నగూడెం-2 అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు కుళ్ళిపోయిన కోడిగుడ్లు పంపిణీ చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. జీవిక, తన్వికకు ఇచ్చిన గుడ్లు కుళ్లిపోయి, లోపల కోడి పిల్లలు కనిపించాయని తెలిపారు. ఆగస్టు ముద్రలతో ఉన్న గుడ్లు పంపిణీ చేసినట్లు గుర్తించి ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
అంగన్‌వాడీ కేంద్రంలో కుళ్ళిన కోడి గుడ్లు పంపిణీ


