హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోమగూడెం (కె) లో కలవరపెడుతున్న జ్వరాలు

MNCL: కాసిపేట మండలం సోమగూడెం (కె) గ్రామంలో జ్వరాలు కలవరపెడుతున్నాయి. కొన్ని రోజులుగా గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో దోమల వ్యాప్తి పెరిగిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా పదుల సంఖ్యలో ప్రజలు జ్వరం బారిన పడ్డారు. ఓ యువకుడు రెండు రోజుల కిందట డెంగీ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.