హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అక్రమ ధాన్యం నమోదు.. చిన్న రైతులకు ఇబ్బందులు

SRCL: చందుర్తి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొందరు పెద్ద రైతులు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకునేందుకు వరి కోతకు ముందే పంటను కోసి రోడ్డుపై ధాన్యం పోస్తున్నారని చిన్న రైతులు ఆరోపిస్తున్నారు. 1, 2 బస్తాల పచ్చి ధాన్యాన్ని రోడ్డుపై పోసి కొనుగోలు కేంద్రంలో పేరు నమోదు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. దీంతో చిన్న రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.