హైదరాబాద్: 28°C
తెలంగాణ

లో వోల్టేజ్‌తో రైతుల అవస్థలు

MLG: కన్నాయిగూడెం (M) వ్యవసాయ మోటార్లకు లో వోల్టేజ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. వ్యవసాయ అవసరాలకు 415 వోల్ట్స్‌ విద్యుత్తు సరఫరా కావాల్సి ఉండగా, ప్రస్తుతం 351 వోల్ట్స్‌ మాత్రమే వస్తుండటంతో మోటార్లు సక్రమంగా పనిచేయడం లేదని రైతులు తెలిపారు. లో వోల్టేజ్ కారణంగా మోటార్లు వేడెక్కి కాలిపోతున్నాయని, మరమ్మతులు, కొత్త మోటార్ల కొనుగోలుకు అధిక ఖర్చులు భరించాల్సి వస్తోందని అంటున్నారు.