హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉరేసుకొని ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య

HNK: అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శాయంపేట నేరేడుపల్లికి చెందిన అడుప నాగరాజు (38) ఏడాది క్రితం ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా ప్రమాదానికి గురై కాలికి తీవ్ర గాయమైంది. ఇన్‌ఫెక్షన్‌ తగ్గకపోవడంతో కాలు తొలగించాలని వైద్యులు సూచించారు. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.