హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు'

ఆసిఫాబాద్ జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ హరిత అన్నారు. తూకం యంత్రాలు, తేమ కొలిచే మీటర్లు, టార్పాలిన్లు, గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.