హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో యాదాద్రి క్రీడాకారుల హవా..!

BHNG: సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో యాదాద్రి జిల్లా జూనియర్ బాలుర, బాలికల జట్లు విజయం సాధించాయి. రెండవ రౌండ్ పోటీలలో బాలుర జట్టు 6 పాయింట్ల తేడాతో జనగామ జిల్లా జట్టుపై గెలుపొందగా, బాలికల జట్టు 10 పాయింట్ల తేడాతో ఆదిలాబాద్ జిల్లా జట్టుపై విజయం సాధించింది.ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య క్రీడకారులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.