హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 6న అండర్-19 వాలీబాల్ జట్ల ఎంపికలు

NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అండర్-19 బాల, బాలికల వాలీబాల్ జట్ల ఎంపికలను మంగళవారం నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ నోడల్ అధికారి తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. బాలికలకు జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ జడ్పీ పాఠశాలలో, బాలురకు కామారెడ్డి గిరిజన సంక్షేమ పాఠశాలలో సెలక్షన్స్ ఉంటాయన్నారు.