హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏపీలో రోడ్డు ప్రమాదం.. సూర్యాపేట జిల్లా వాసి మృతి!

SRPT: ఏపీలోని ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో, అనంతగిరి మండలం వసంతపురం గ్రామానికి చెందిన మొండితోక సుందరరావు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై విజయవాడ నుంచి నందిగామ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.