హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాంసిలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ADB: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని సంబంధిత అధికారులు తెలియజేశారు. విద్యుత్తు లైన్ కెపాసిటర్ ను అమర్చడం, మరమ్మత్తుల రీత్యా సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.