హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూడు రోజుల పాటు జిల్లా పది వసంతాల వేడుకలు

సిద్దిపేట జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న శుభసందర్భంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆవిర్భావ వేడుకల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించి అభిప్రాయాలు స్వీకరించారు. 2016లో కేసీఆర్ జిల్లాను ఏర్పాటు చేశారని, ఈ వేడుకల్లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు.