WG: నరసాపురం టౌన్ 19వ వార్డులోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహానికి జనసేన సీనియర్ నాయకులు బెల్లంకొండ ఎర్రియ్య నాయుడు ఆధ్వర్యంలో సమకూర్చిన స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ, మూడు సీలింగ్ ఫ్యాన్లను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఎమ్మెల్యే ఆత్మీయంగా మాట్లాడి, వారి చదువులు మరియు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థుల వసతి గృహానికి టీవీ, ఫ్యాన్లు అందజేత


