హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నేడు గిరిజన దర్బార్ కార్యక్రమం'

BDK: ఐటీడీఏ సమావేశ మందిరంలో నేడు గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు పీవో బి.రాహుల్ తెలిపారు. దర్బారు వచ్చే అర్జీదారుల సమస్యలను వెంటనే పరిశీలించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. గిరిజనులు తమ సమస్యలపై లిఖితపూర్వకంగా అర్జీలు అందజేయవచ్చని పేర్కొన్నారు. ఐటీడీఏ యూనిట్ అధికారులు ఉదయం 10.30 గంటలకల్లా తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.