హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు'

GNTR: కృష్ణాయపాలెం టిట్కో హౌసెస్‌లో ఆదివారం రాత్రి మంగళగిరి రూరల్‌ పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు. సీఐ చిరుమామిళ్ల వెంకట్‌ మాట్లాడారు. డ్రగ్స్‌, బహిరంగ మద్యపానం, రాత్రివేళ న్యూసెన్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో గొడవలకు పాల్పడరాదన్నారు.