హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫసల్వాది ఉపాధ్యాయుడికి జాతీయ పురస్కార ప్రదానం

SRD: ఫసల్వాది జెడ్పీ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు చంద్రశేఖర్‌ జాతీయ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ త్యాగరాయ గానసభలో మనం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చక్రవర్తి చేతుల మీదుగా ఆయనను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయుడిగా 25 ఏళ్లుగా అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కినట్లు చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.