హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓఆర్‌ఆర్‌పై కార్లు, డీసీఎం ఢీ.. ఇద్దరి పరిస్థితి విషమం

SRD: పటాన్‌చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎగ్జిట్-4 సమీపంలో ఓ కారును డీసీఎం వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ఎగిరి పక్క లైన్లో వస్తున్న మరో కారుపై పడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.