హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరసవల్లి ఆదాయం ఎంతంటే?

శ్రీకాకుళం పట్టణంలో ఉన్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి నిన్న భక్తుల ద్వారా రూ.5.06 లక్షల ఆదాయం సమకూరింది. విరాళాలు, ప్రసాదాలు, దర్శన టికెట్ల విక్రయాల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ తెలిపారు. ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారని చెప్పారు.