హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భోరజ్‌లో సోయాబీన్ కోతలు ప్రారంభం

ADB: భోరజ్ మండల కేంద్రంలోని బాలాపూర్, సావాపూర్, హశంపూర్, పలు గ్రామాల్లో సోయాబీన్ పంట కోతలు ప్రారంభమయ్యాయి. రైతులు హార్వెస్టర్ తో పంటను కోసి ట్రాక్టర్లలో ఇళ్లకు తరలిస్తున్నారు. పంటలో తేమ శాతం తగ్గించడానికి ఎండలో ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తరలిస్తామని రైతులు తెలిపారు. మంచి ధర వస్తుందన్న ఆశాభావంతో రైతులు కోత పనుల్లో నిమగ్నమయ్యారు.