హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మానవత సంస్థను బలోపేతం చేయాలి: ఎన్‌. రామచంద్రరెడ్డి

అన్నమయ్య: రాయచోటిలో మానవత సంస్థ ప్రతినిధులతో వ్యవస్థాపకులు ఎన్‌. రామచంద్రరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు అవటాల రామాంజులరెడ్డి సమావేశమయ్యారు. సభ్యత్వ నమోదును సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఆపదలో ఉన్నవారికి, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. పరస్పర సహకారంతో సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని సూచించారు.