హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

80% సబ్సిడీతో ఉలవలు పంపిణీ: ఎమ్మెల్యే

సత్యసాయి: కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల సచివాలయం పరిధిలోని స్థానిక రైతులకు 80 శాతం సబ్సిడీతో 30 క్వింటాళ్ల ఉలవలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొని, మాట్లాడారు. ​ఒక్కో రైతుకు 10 కేజీల ఉలవలను అందించారు. 10 కేజీల ఉలవల అసలు ధర రూ. 740 కాగా, ప్రభుత్వం ఇచ్చే రూ. 592 సబ్సిడీ పోను రైతులు కేవలం రూ. 148 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.