హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనర్ల తల్లిదండ్రులకు పోలీసుల కౌన్సెలింగ్

KMM: మైనర్లకు వాహనాలు అప్పగిస్తే తల్లిదండ్రులపైన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ఆదివారం అటవీశాఖ కార్యాలయం వద్ద ఎస్సై తిరుపతిరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి, పెండింగ్ చలానాలు వసూలు చేశారు. వాహనాలతో పట్టుబడిన మైనర్ల తల్లిదండ్రులకు జరిమానా విధించి కౌన్సెలింగ్ ఇచ్చారు. హెల్మెట్, సరైన పత్రాలు లేకుండా ప్రయాణించవద్దని సూచించారు.