BHNG: భువనగిరి పట్టణ శివారులోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. క్యూ లైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో బోనాలు, వడిబియ్యం, ధూపదీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసర ప్రాంతం సందడిగా మారింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ
VIDEO: భువనగిరి ఎల్లమ్మతల్లి ఆలయంలో భక్తుల సందడి


