హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదివాసీలకు ఏఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పిలుపు

BDK: భద్రాద్రి కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించే మహాధర్నా, ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఎస్పీ రాష్ట్ర కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దిపల్లిలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. మహాధర్నాకు ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు.