హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలపై పోలీసుల నిఘా !

TPT: సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని 41 పోలింగ్ కేంద్రాలను సీఐ ఎం.మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ మార్గాలు, పరిసరాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలు చేపడుతున్నామని సీఐ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.