హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కుళాయిల ద్వారా తాగునీరు అందించండి'

AKP: మరుపాకలో అసంపూర్తిగా ఉన్న ఇంటింటి కుళాయి పథకాన్ని పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. జలజీవన్ మిషన్ 2.0 పథకంలో భాగంగా మూడు ఏళ్ల క్రితం పనులు చేపట్టారు. నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్ పనులను నిలిపివేశారు. బోరు, విద్యుత్ పంపు, పైప్ లైన్ పనులు పూర్తయినప్పటికీ, పంప్ హౌస్లో ప్యానెల్ బోర్డు బిగించి నీటి సరఫరాను ప్రారంభించాల్సి ఉంది.