హైదరాబాద్: 28°C
తెలంగాణ

టైరు పగిలి పొలాల్లోకి దూసుకెళ్లిన వ్యాన్

కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. హుజూరాబాద్ పట్టణ పరిధిలోని పెద్ద పాపయ్యపల్లి శివారులో ఆదివారం ఉదయం ఓమ్ని వ్యాన్ వెనుక టైరు ఒక్కసారిగా పేలడంతో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని హనుమకొండ కొత్తూరు జెండా ప్రాంతానికి చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు.