హైదరాబాద్: 28°C
తెలంగాణ

కిష్టాపూర్‌ గ్రామంలో నిరుపయోగంగా రైతు బజారు

NRPT: జిల్లాలో నిర్మించిన రైతు బజార్లు లక్ష్యం దిశగా ముందుకు సాగడం లేదు. ఊట్కూరు మండలం బిజ్వార్, ధన్వాడ మండల కేంద్రంతో పాటు కిష్టాపూర్‌ గ్రామంలో రైతు బజార్లు నిర్మించారు. ఒక్కో దానికి రూ.15లక్షల నుంచి రూ.20లక్షల వరకు వెచ్చించారు. కొన్నిచోట్ల ఉపయోగంగా ఉన్నా వసతులు కరవయ్యాయి. మరికొన్ని చోట్ల నిరుపయోగంగా ఉండటంతో అమ్మకందారులకు ఇబ్బందిగా తయారైంది.