హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలమయంగా నర్మెట్ట-జనగామ రహదారి

JN: నర్మెట్ట-జనగామ ప్రధాన రహదారిపై విజయ డెయిరీ సమీపంలోని కల్వర్టు వద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. రాత్రివేళ వాహనదారులు ఏమరుపాటుగా ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆదివారం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కల్వర్టు ఎత్తు పెంచడంతో పాటు రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.