గద్వాల రాజీవ్ మార్గ్‌లోని షాపుల వద్ద ఉన్న మురుగుకాల్వ ప్లాస్టిక్, చెత్త వ్యర్థాలతో పూర్తిగా పూడుకుపోయింది. నీటి ప్రవాహం నిలిచి దుర్వాసన వెదజల్లుతుండటంతో వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమలు వ్యాపించి వ్యాధులు సోకే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కాలువను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
రాజీవ్ మార్గ్‌లో పూడుకుపోయిన మురుగుకాల్వ


