హైదరాబాద్: 28°C
తెలంగాణ

విరిగిన హోల్డింగ్స్‌.. పట్టించుకునే వారే లేరా..?

జనగామ జిల్లా కేంద్రంలోని డివైడర్ల మధ్య ప్రకటనల కోసం ఏర్పాటు చేసిన హోల్డింగ్స్‌ విరిగిపోయి రోడ్డుపై పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెహ్రూ పార్క్‌ వద్ద ఓ హోల్డింగ్‌ ఊడిపోయి రోడ్డుపై పడింది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు, ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.