BDK: బూర్గంపాడు మండలం సారపాక అటవీ ప్రాంతంలో విషం తీసుకున్న అంజనాపురానికి చెందిన భూక్య మురారి (20) చికిత్స పొందుతూ మృతి చెందాడు. శనివారం అటవీ ప్రాంతం నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, కుటుంబీకులు అతడిని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స ఫలించక మురారి రాత్రి ప్రాణాలు కోల్పోయాడు.
తెలంగాణ
చికిత్స పొందుతూ యువకుడి మృతి


