SDPT: కోహెడ మండలం శంకర్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల వివరాలు, ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీ తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి


