హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నవాబ్‌పేటను కరువు మండలంగా ప్రకటించాలి'

MBNR: ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి, సాగు సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని నవాబ్‌పేట మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు హెచ్చరించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నవాబ్‌పేట మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని స్థానిక సర్పంచులు సభ దృష్టికి తీసుకురాగా.. అందుకు అనుగుణంగా తీర్మానం చేసి జిల్లా ఉన్నతాధికారులకు పంపాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.