HNK: నడికూడ మండలంలోని ఎర్రమ్మ గుట్ట ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని ఎర్రమ్మ తల్లి గుట్ట పరిరక్షణ సమితి ఆరోపించింది. సర్వే నంబర్ 525/1లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపింది. 2 నెలల క్రితమే తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆదివారం పేర్కొంది. అధికారులు స్పందించి నిర్మాణాలు నిలిపివేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేసింది.
తెలంగాణ
'ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు తీసుకోవాలి'


