హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

WNP: పెద్దమందడి మండలం దొడగుంటపల్లిలో నేడు ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య సమితి గ్రామ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా ఘనపూర్-పెద్దమందడి వ్యవసాయ మార్కెట్ ఉపాధ్యక్షుడు కొత్తకాపు వెంకటేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. గ్రామ ముఖ్య నాయకులు అశోక్‌రెడ్డి, సుదర్శన్, రైతులు, ఉపసర్పంచ్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.