హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాకాడు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ

TPT: వాకాడు మండలం తిరుమూరు గ్రామంలో ఆదివారం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వీఆర్వో హరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నేత, తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి కుంచం దయాకర్ రైతులకు పాసుపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి రైతుకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.