KMR: ఎల్‌నినో ప్రభావంతో ఎండలు మండిపోతున్నాయి. జిల్లాలోని బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో గరిష్ఠంగా 36.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రాజంపేట మండలం ఆరుగొండలో 31.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
తెలంగాణ
కామారెడ్డి జిల్లాలో మండిపోతున్న ఎండలు


