హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆధార్‌ అప్‌డేట్‌ అని చెప్పి.. భూమి రిజిస్ట్రేషన్‌ చేశారా?

SRPT: కోదాడలోని లక్ష్మీపురం కాలనీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆధార్ కార్డు అప్‌డేట్ చేయిస్తానని నమ్మించి ఒక వృద్ధురాలి  వ్యవసాయ భూమిని ఇతరుల పేరిట మార్చారు. తనకు చెందిన సుమారు 20 గుంటల విలువైన భూమిని మోసపూరితంగా మనవరాలు వినీత పేరుపైకి మార్చేశారని బాధితురాలు రాములమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. న్యాయం చేయాలని అధికారులను, పోలీసులను వృద్ధురాలు వేడుకుంటోంది.