కోనసీమ: రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్, అవుట్‌పోస్ట్‌ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్ ప్రారంభించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు ప్రజలు, వాహనదారుల భద్రతకు ఇవి దోహదపడతాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ సుంకర మురళీమోహన్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రావులపాలెంలో ట్రాఫిక్ సిగ్నల్, అవుట్‌పోస్ట్ ప్రారంభించిన ఎస్పీ


