హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుగ్గలిలో రేపటి నుంచి ఎఫ్‌ఏ-2 పరీక్షలు

KRNL: తుగ్గలి మండలంలో సోమవారం నుంచి ఎఫ్‌ఏ-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎంఈవో ప్రవీణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఎంఈవో సూచించారు.