SDPT: బెజ్జంకి మండలం గూడెం గ్రామంలో ఆదివారం డ్రైనేజీ కాలువల శుభ్రత పనులు చేపట్టారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి, పూడికను తొలగించారు. గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం పాల్గొంది.
తెలంగాణ
గూడెంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరం


