హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మంలో రేపటి నుంచి పెసల కొనుగోళ్లు..!

KMM: కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఖమ్మం, వైరా మార్కెట్లలో పెసల కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. కొనుగోళ్ల బాధ్యతను డీసీఎంఎస్‌కు అప్పగించినట్లు ఆ సంస్థ బిజినెస్ మేనేజర్ సందీప్ తెలిపారు. వ్యవసాయశాఖ ఆన్‌లైన్‌లో పంట వివరాలు నమోదు చేసుకున్న రైతులనుంచి బయోమెట్రిక్ (వేలిముద్రలు)ఆధారంగా ఈ కొనుగోళ్లు జరుపుతామని ఆయన పేర్కొన్నారు.