AKP: తిమ్మరాజుపేటలో ప్రమాదకరంగా మారిన ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. రాజుగారి ఇస్తావకు వెళ్లే మార్గంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఓవైపునకు ఒరిగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయంగా మారింది. ఈ సమస్యపై అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు పూర్తి చేశారు. ప్రమాదం తప్పడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఒరిగిపోయిన ట్రాన్స్‌ఫార్మర్.. ఎట్టకేలకు మరమ్మతులు


