హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా విద్యుత్ వైర్‌లు

ASF: సిర్పూర్ (టి) మండలం వెంకట్రావుపేటకు చెందిన మంజుబాయ్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం విద్యుత్ వైర్లతో నిలిచిపోయింది. స్లాబ్ వేసే సమయంలో పైభాగంలో ఉన్న వైర్ల కారణంగా విద్యుత్ ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు తెలిపారు. నెల రోజులుగా పనులు నిలిచాయి. వైర్లు తొలగించాలని 10 రోజుల క్రితం ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని వాపోయారు.