హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరువూరులో మైనారిటీ స్కూల్ స్థలం పరిశీలన

NTR: కోకిలంపాడు గ్రామంలో మైనారిటీ మహిళల రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ప్రతిపాదించిన 5.50 సెంట్ల స్థలాన్ని తిరువూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. కుమార్ పరిశీలించారు. స్థల పరిస్థితులు, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన తదుపరి చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్, మండల సర్వేయర్, సిబ్బంది పాల్గొన్నారు.