హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై ప్రమాదకర గుంతలను పూడ్చివేసిన యువకులు

హన్మకొండ జిల్లా శాయంపేట- మాందరిపేట రోడ్డుపై ఏర్పడిన ప్రమాదకర గుంతలను ఆదివారం మాందారిపేట గ్రామానికి చెందిన యువకులు కొమ్ముల సంతోష్, ఎండి రఫీక్, నిమ్మల రాజ్ కుమార్‌లు పూడ్చివేశారు. గుంతలు ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా స్పందించిన యువకులు సిమెంట్, కంకర పోసి పూడ్చారు. దీంతో వారిని వాహనదారులు, మండల ప్రజలు అభినందించారు.