హైదరాబాద్: 28°C
తెలంగాణ

390కి పైగా అక్రమ నిర్మాణాలు కూల్చివేత

HYD: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 390కి పైగా అనుమతి లేని భవనాలను అధికారులు కూల్చివేశారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు. అంజయ్యనగర్ భవనం కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన తర్వాత తనిఖీలు ముమ్మరం చేశారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో అనుమతుల్లేని, నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాలపై చర్యలు కొనసాగుతున్నాయి.